గోమాతను పూజించే భూమి పావనం
గోపాష్టమి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...

గోమాతను పూజించే భూమి పావనం
గోపాష్టమి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్: సనాతన ధర్మంలో గోమాతను, స్త్రీని పూజించే భూమి పావనమవుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. గోశాల కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని గోపాల్ బాగ్ లో గోపాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందూ ధర్మంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం వస్తుందన్నారు. ఇందూరు గోశాలకు దక్షిణ భారతదేశంలోనే పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నారు. ఈ గోశాలకు సుమారు వందేళ్ల చరిత్ర ఉందన్నారు. భవిష్యత్తులో గోశాలకు ఎటువంటి అవసరం ఉన్నా..తాను ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గోశాల కమిటీ అధ్యక్షులు పవన్ కేడియా, ట్రస్ట్ అధ్యక్షులు కైలాష్ గోయెంకా, కార్యదర్శులు మాస్టర్ శంకర్, కమల్ ఇనాని, కోశాధికారి ధన్పాల్ శ్రీనివాస్, సీనియర్ ట్రస్ట్ మెంబర్ ప్రదీప్ జై భీమానీ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్త, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రాజు, రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ధన్ పాల్ దత్తు బిజెపి సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






