Mana Indur News
రాజకీయం

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం మాట ఇచ్చి మరిచింది.

అర్బన్ MLA క్యాంప్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా

MI
By Mana Indur News•November 17, 2026
43
Share
తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం మాట ఇచ్చి మరిచింది.

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం మాట ఇచ్చి మరిచింది.

MLA క్యాంప్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చి మరిచింధని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వై. ఓమయ్య అన్నారు.మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆరవ రోజు ధర్నాలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి, రైల్వే బ్రిడ్జ్, నాందేవ్ వాడ, హమాల్వాడి, సుభాష్ నగర్ మీదుగా అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని ప్రభుత్వం మాట ఇచ్చి మరిచిందన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో అనారోగ్యం బారిన పడ్డ ప్రజలు వస్తారని వారికి సరిపడా బెడ్లు గాని, సిబ్బంది గాని లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. నిజామాబాద్ ఆసుపత్రిలో వెయ్యి బెడ్ లకు పెంచాలని డిమాండ్ చేస్తుంటే రెండు సంవత్సరాల క్రితం 750 పడకలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చి, దానికి సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఉద్యోగ కార్మికులు పెరగక 615 బెడ్ లకు సంబంధించిన కార్మికులతోనే పని తీసుకుంటున్నారన్నారు. దీనివల్ల విపరీతమైన పని భారం సిబ్బందిపై పడి పనికి రాలేని పరిస్థితి నెట్టబడుతున్నారని, ఆసుపత్రికి వస్తున్న ప్రజలకు సరైన సౌకర్యాలు అందించలేకపోతున్నారని, వెంటనే 750 పడకలకు సంబంధించిన బడ్జెట్ను కేటాయించడానికి ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వంతో మాట్లాడాలని తెలియజేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ ,సెక్యూరిటీ కార్మికులకు వేతనానికి సరిపడా పీఎఫ్ కట్ చేయించాలని పండగ, జాతీయ ఆర్జిత సెలవులు ఇప్పించాలని తెలియజేశారు.సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..ఆసుపత్రి సమస్యలపై సానుకూలంగా స్పందించారని, ఆరోగ్యశాఖ మంత్రి కి, ప్రభుత్వానికి వెంటనే రాతపూర్వకంగా తెలియజేయడంతో పాటు మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు డి చక్రపాణి జిల్లా కార్యదర్శి గోవర్ధన్ కోశాధికారి ఫెరోజ్ అలీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, కవిత ,స్వరూప, భారతి ,సాయి సుధా, పవిత్ర ,సాయి రెడ్డి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5