బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో గ్రామంలో మెరుగైన రోడ్లు
సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మన ఇందుర్ /భీమ్‌గల్ రూరల్ :
భీమ్‌గల్ మండలం చెంగల్ గ్రామంలో బుధవారం సర్పంచ్ చేతుల మీదుగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.సర్పంచ్ దుమ్మాల మమత రాజు మాట్లాడుతూ..,కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో గ్రామంలో మెరుగైన రహదారి నిర్మాణ పనులను చేపట్టమన్నారు.సరైన రహదారి లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,గ్రామాభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.మరిన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, పనులను నాణ్యతతో,సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఆర్మూర్ రవి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూతుల రమేష్,అడప రాజేశ్వర్, వసంత రెడ్డి,శోభన్ గౌడ్, ప్రశాంత్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.






