Mana Indur News
రాజకీయం

ఎస్ ఐ ఆర్ ను రద్దు చేసి అర్హులకు ఓట్ హక్కు కల్పించాలి.

తొలి మేయర్ ధర్మపురి సంజయ్

MI
By Mana Indur News•September 28, 2026
2
Share
ఎస్ ఐ ఆర్ ను రద్దు చేసి అర్హులకు ఓట్ హక్కు కల్పించాలి.

ఎస్ ఐ ఆర్ ను రద్దు చేసి అర్హులకు ఓట్ హక్కు కల్పించాలి.

జ్ఞానేష్ కుమార్ ను రాజీనామా చేయాలి

తొలి మేయర్ ధర్మపురి సంజయ్..

మన ఇందూర్ న్యూస్ / నిజామాబాద్ అర్బన్:

ఎస్ ఐ ఆర్ ను రద్దు చేసి అర్హులందరికీ ఓట్ హక్కు కల్పించాలని మాజీ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తొలగింపును డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నాయకత్వంలో గాంధీ చౌక్ నుండి ప్రారంభమై, నిజామాబాద్ బస్ స్టాండ్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ముందుగా ధర్మపురి శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. డి.సంజయ్ గా ఉన్న పేరును ధర్మపురి సంజయ్ గా రాసినందుకు తొలి మేయర్ అయిన తనకే నోటీసులు పంపించారని గుర్తు చేశారు. మాలాంటి వారికి నోటీసులు ఇస్తున్నారంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం ఓట్లు కొల్లగొట్టడమే ఎజెండాగా పనిచేస్తుందన్నారు. వారికి నచ్చిన వారిని మాత్రమే ఓట్లు వచ్చేలా, మిగతా వారి ఓట్లు గల్లంతయ్యి ఎలా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓటు హక్కు కల్పించాం. మేము ఇచ్చిన ఓటర్ ఐడి తోనే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని అన్నారు. ఎస్ ఐ ఆర్ ను రద్దు చేసి అర్హులకు ఓటు హక్కు కల్పించాలన్నారు. ఇవిఎం తొలగించి పాత పద్ధతి ప్రకారం బ్యాలెట్ తో ఓటింగ్ జరిపించాలన్నారు. బీజేపీ చేసిన కుట్రను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల కమిషనర్ గా ఉంటూ బిజెపి తొత్తుగా మారిన జ్ఞానేష్ కుమార్ ను రాజీనామా చేయాలని, చేసేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ శాంతియుత ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5