క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను సర్వే చేసి నష్టాన్ని నమోదు చేయాలి
ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలి

కరువుపై కేంద్రానికి పంపిన నివేదిక ను బహిర్గతం చేయాలి.
క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను సర్వే చేసి నష్టాన్ని నమోదు చేయాలి
ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలి
తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని కేంద్రానికి సిపిఐ డిమాండ్
సిపిఐ జాతీయ నాయకురాలు పశ్య.పద్మ
మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:
కరువుపై కేంద్రానికి పంపిన నివేదిక ను బహిర్గతం చేయాలని,క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను సర్వే చేసి నష్టాన్ని నమోదు చేయాలని
సిపిఐ జాతీయ నాయకురాలు పశ్య.పద్మ అన్నారు. కరువు పై వేసిన సబ్ కమిటీకి మల్టీ లెవెల్ డిస్ప్లే నరి కమిటీ ఇచ్చిన నివేదికను బహటం చేయాలన్నారు. రబీలో పంట వేయొద్దని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆరుతడి పంటల విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలన్నారు.మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, ప్రజలు- కార్మికులు -విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ రాజా గౌడ్ కు పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ నాయకురాలు పశ్య పద్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎల్ ని నో ప్రభావంతో కరువు చాయలు నెలకొన్నాయని రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరువు పరిస్థితుల నేపథ్యంలో కరువు రాష్ట్రంగా ప్రకటించాలని, కరువు పై కేంద్రానికి పంపిన నివేదికను బహిర్గతం చేయాలన్నారు. కరువు పై వేసిన సబ్ కమిటీకి మల్టీ లెవెల్ డిస్ప్లే నరి కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని, తక్షణం అఖిలపక్ష పార్టీల రైతు సంఘాల సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. పంట నష్టం కరువు సహాయక చర్యల కోసం ఎంత నిధి అవసరమో వాస్తవన నివేదికలను రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం అన్ని రకాల ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టాలని, పొట్ట కొచ్చిన వరి పంటను రక్షించేందుకు సాగునీరు అందించాలని కరెంటు కోతలు లేకుండా సక్రమంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని, నష్టపోయిన పంటలకు వరికి ఎకరానికి 30వేలు, పత్తి, మిర్చికి 50 వేలు, ఇతర పంటలకు 20వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని, రాష్ట్రంలో ప్రాజెక్టులలో నీటి లభ్యతను చేత పత్రం ద్వారా ప్రకటించాలని త్రాగునీటి సమస్యను నివారించేందుకు గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలన్నారు. విద్యుత్ కోతలను నివారించేందుకు విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రబీ పంటలు సాగు చేసే పరిస్థితి లేనందున రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కౌలు రైతులను గుర్తించి పంట నష్టపరిహారం ఇవ్వాలని, చిన్న సన్నాకారు రైతులకు, వ్యవసాయ కార్మికులకు కౌలు రైతులకు అదనపు పని దినాలు వి బి జి రామ్ జి ద్వారా కల్పించాలని పశువుల మేత సరఫరా చేయాలని కరువు పరిస్థితుల్లో 14 రకాల నిత్యవసర వస్తువులను చౌక దుకాణాల ద్వారా సరఫరా చేయాలని కరువు వలన పని కోల్పోతున్న అసంఘటితరంగా కార్మికులకు ప్రత్యేక పథకం ద్వారా ఉపాధి కల్పించాలని జిల్లాలో బియ్యం ధరలను పెంచకుండా సూపర్ మార్కెట్ నిర్వాహకులను బియ్యం విక్రయిస్తున్న వ్యాపారులను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు
జి హెచ్ ఆస్పత్రికి వెయ్యి పడకలకు పెంచాలి.
నిజామాబాద్ జిల్లా కేంద్రం లో ఉన్న జి జి హెచ్ ఆస్పత్రికి వెయ్యి (1000)పడకలకు పెంచాలని, కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. వెయ్యి పడకలకు అవసరమైన శానిటేషన్, పేషెంట్ కేర్, ఇతర సిబ్బంది ని పెంచాలన్నారు.
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 8200 కోట్ల నిధులను చెల్లించాలి.
విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 8200 కోట్ల నిధులను చెల్లించాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులని, విద్యార్థులు చదువులు సాఫీగా సాగాలంటే ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని సిపిఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్. నాయకులు వై రాజిరెడ్డి, ఎమ్.స్వరూప రాణి, ఆలీ ఇమ్రాన్, ఫిరోజ్, పిన్నెల హనుమాన్లు, బి రఘురాం, రంజిత్, కుశాల్, కిషోర్, కవిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు






