Mana Indur News
రాజకీయం

రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేల భిక్షాటన.

కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే బ్రిడ్జిలను నిర్లక్ష్యం చేస్తుంది.

KA
By KARKA RAMESH•October 27, 2026
24
Share
రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేల భిక్షాటన.

ఉత్తర తెలంగాణపై సీఎం రేవంత్ రెడ్డి వివక్ష..

కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే బ్రిడ్జిలను నిర్లక్ష్యం చేస్తుంది.

కాంగ్రెస్ పై నిప్పులు చేరిగిన ఎంపీ అరవింద్, శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి.

మాధవ నగర్ రైల్వే బ్రిడ్జి వద్ద ఇందూర్ బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష.

రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం ఎంపీ, ఎమ్మెల్యేల భిక్షాటన.

మన ఇందూర్ న్యూస్ / నిజామాబాద్:

ఉత్తర తెలంగాణపై సీఎం రేవంత్ రెడ్డి వివక్ష చూపిస్తున్నారని శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. మాధవ్ నగర్ ఆర్ఓబి రెండవ అతి ప్రాధాన్యత గల పని అని, తాను నిరసన దీక్ష చేస్తూ బిక్షటన చేస్తున్నానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందూర్ బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష చేపట్టారు. ఇందుకోసం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి లతోపాటు బీజేపీ నాయకులు భిక్షాటన చేశారు. మాధవ నగర్ రైల్వే బ్రిడ్జికి నిధులు మంజూరు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. తెలంగాణలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలను వెంటనే పూర్తి చేయాలని

మంగళవారం మాధవ నగర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్ష శిబిరానికి బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలోని నిధులన్నీ కొడంగల్ కే తరలిస్తూ ముఠామేస్త్రి గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు. పౌరసరపరాలలో జరిగిన క్రమాల వల్లే రాష్ట్రంలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణకు అభివృద్ధి విషయంలో వివక్షత కనబరుస్తున్నారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, విద్యార్థులకు విద్యార్థినులకు స్కూటీలు ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ తో చీకటి ఒప్పందం వల్లే అవినీతి అక్రమాలను బయట పెట్టడం లేదని విమర్శించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే బ్రిడ్జిలపై పూర్తి నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఎంపీ అరవింద్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కమిషన్ల భయానికి కాంట్రాక్టర్లు పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో మా నాన్న అడిగితేనే కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి రమ్మంటే వెళ్తానా అంటూ ఎంపీ అరవింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రైల్వే నిధుల కోసం నేను ధర్నా ప్రకటిస్తే కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని కలిశారని, కానీ దానివల్ల ఒరిగిందేమీ లేదన్నారు. కౌన్సిలర్ గా కూడా గెలవలేని మహేష్ కుమార్ గౌడ్ ను పార్టీ అధ్యక్షునిగా ఎందుకు చేశారో అర్థం కావడం లేదన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రైల్వే బ్రిడ్జి పనులకు రాష్ట్ర వాటాగా వచ్చే నిధులను ఇప్పించాలని ఎంపీ అరవింద్ కోరారు. జిల్లా కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే మాధవ నగర్ రైల్వే బ్రిడ్జి కోసం 9 కోట్ల రూపాయల ఫైనాన్స్ క్లియరెన్స్ ఇప్పించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలు రైల్వే బ్రిడ్జి వద్ద బిక్షాటన చేశారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, స్రవంతి రెడ్డి, ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, భరత్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాకారుల ఆటపాటలతో దీక్ష శిబిరం కొనసాగింది. నిరసన దీక్ష సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5