Mana Indur News
రాజకీయం

రైతాంగానికి సాగునీరు, నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించాలి..

క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి.. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తీర్మానాలకు ఎంపీ ధర్మపురి అర్వింద్ సంపూర్ణ మద్దతు, ఏకగ్రీవ ఆమోదం.

KA
By KARKA RAMESH•October 22, 2026
7
Share
రైతాంగానికి సాగునీరు, నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించాలి..

రైతాంగానికి సాగునీరు, నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించాలి..

క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి.

– బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తీర్మానాలకు ఎంపీ ధర్మపురి అర్వింద్ సంపూర్ణ మద్దతు, ఏకగ్రీవ ఆమోదం.

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:

రైతాంగానికి సాగునీరు, నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించాలని, క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు.

గురువారం బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాగు, సాగునీటి సమస్యలు, రైతాంగ ఇబ్బందులు ప్రజా సమస్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తీర్మానాలను ప్రవేశపెట్టగా, వాటికి ఇందూర్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో పాటు కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ప్రవేశపెట్టిన ప్రధాన తీర్మానాలు:

ఎల్-నినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సాగునీరు అందక రైతులు వేసిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి. అన్నదాతలను ఆదుకునేందుకు వ్యవసాయానికి రోజుకు కనీసం 8 గంటల పాటు నిరంతర, నాణ్యమైన త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలి. కరెంట్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలను పరిష్కరించని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతాం.ఎల్-నినో ప్రభావం వల్ల నీటి కొరతను సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ‘క్రాప్ హాలిడే’ ప్రకటిస్తే, రైతులకు ఎకరాకు రూ.50,000 చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు.ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 27వ తేదీ (మంగళవారం) నాడు పెద్ద ఎత్తున 'దీక్ష' కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ దీక్షలో జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దె భూమన్న, భారత్ రెడ్డి, పొతన్ కార్ లక్ష్మీనారాయణ, నగ్గోల్ల లక్ష్మీనారాయణ, నిమ్మల శ్రీనివాస్, ప్రమోద్ కుమార్, జ్యోతి, బంటు రాము, నక్క రాజేశ్వర్, బద్దం కిషన్, జిల్లా పదాధికారులు, మోర్చ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5