Mana Indur News
రాజకీయం

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు నిర్వహించిన నగర కాంగ్రెస్ నాయకులు

నగరంలోనీ 47, 20 వ డివిజన్ లలోని ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి వేడుకలలో పాల్గొన్న నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ.

KA
By KARKA RAMEESH•November 8, 2026
15
Share
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు నిర్వహించిన నగర కాంగ్రెస్ నాయకులు

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు నిర్వహించిన నగర కాంగ్రెస్ నాయకులు

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నిజామాబాద్ నగరంలోనీ 47, 20 వ డివిజన్ లలోని ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి వేడుకలలో పాల్గొన్న నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ. ఈ కార్యక్రమం 47 డివిజన్ కార్పొరేటర్ మనోహర్ గారు, 20 వ డివిజన్ ఇంచార్జ్ ఒడ్డెపు వికాస్ డివిజన్లలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలలో DCC అధ్యక్షులు నగేష్ రెడ్డి , మాజీ PCC కార్యదర్శి నరాల రత్నాకర్ పాల్గొని లబ్ధిదారులకు బట్టలు పెట్టడం జరిగింది. అలాగే స్వీట్లు తినిపించుకొని, లబ్ధిదారుల కుటుంబంతో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కళ అని దానిని నెరవేర్చే విధంగా అర్హులైన వారికి ఇల్లు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, దీని ద్వారా ఎంతో మంది కళ నిజమైందని ఇందిరమ్మ ఇల్లు అందుకున్న ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఈ దీపావళి రోజున ఇందిరమ్మ ఇండ్లలో సంతోషాలతో కూడిన వెలుగులు నింపుతున్నారని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బింగి మధు, చంద్ర కళ, విజయరాణి, పుప్పాల విజయ ల్, అబ్దుల్ వహీద్, మల్యాల గోవర్ధన్, మీర్జా అమీర్ బేగ్, రాజు, మహేందర్, సయ్యద్ అయిజాజ్ పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5