సుద్దపల్లి శివారులోని బ్లాక్ స్పాట్ తో నిత్యం ఎన్నో ప్రమాదాలు
ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ మంజూరై 6 నెలలు గడుస్తున్న పనులను ప్రారంభించకుండా కాలయాపన

మన ఇందూర్/డిచ్ పల్లి:
సుద్దపల్లి శివారులోని బ్లాక్ స్పాట్ తో నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని బీజేవైఎం నాయకులు సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
సుద్దపల్లి శివారులో బ్లాక్ స్పాట్ ఉండడం వల్ల నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో చేసిన ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ మంజూరు అయినప్పటికీ కూడా 6 నెలలు గడుస్తున్న ఇప్పటి కూడా ఏ అధికారులు పనులను ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. జక్రాన్ పల్లి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు జాతీయ రహదారి హైవే అథారిటీ కాంట్రాక్టర్లను పనులు జరగకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. సిఎంసి వద్ద సర్వీస్ రోడ్డుకు, ఐ లెవెల్ వంతెన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల మంజూరు చేసిందన్నారు.రూరల్ ఎమ్మెల్యే అనుచరులు రోడ్డు పనులకు మొరం కావాలని అడిగితే మాకు కమిషన్ ఇవ్వాలని, లేకుంటే మొరం రాదని చెబుతున్నారన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్న ఇక్కడ కమిషన్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.ఎమ్మెల్యే పేరుతో లోకల్ లీడర్ పొలాసాని శ్రీనివాస్, మునిపల్లి సాయిరెడ్డి కమిషన్లు పేరుతో అరాచకాలు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉండాలంటే ప్రజల సమస్యలు తీర్చాలి కానీ ప్రజలకే సమస్యలు తీసుకొని వస్తే ఎవ్వరు చూస్తూ ఊరుకోరన్నారు.చిల్లర వేషాలు వేస్తే ఊరుకునేది లేదన్నారు. పనులు ప్రారంభించకుంటే ఎమ్మెల్యే ను గ్రామాలకు రానివ్వకుండా చేస్తామన్నారు. అధికారంలో ఉన్నామని ఇల్లీగల్ దందాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు జిల్లా కలెక్టర్, ఆర్డిఓ కార్యాలయాలను ముట్టడి చేస్తామని సుద్దపల్లి గ్రామస్తుడు సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో గ్రామస్తులు ఉపసర్పంచ్ క్రాంతికుమార్ ,మోహన్, గణేష్ పాల్గొన్నారు.





