Mana Indur News
రాజకీయం

ప్రభుత్వ పాఠశాలల స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ధర్నా

మూడు నెలల వేతనాలు చెల్లింపుకు కలెక్టర్ హామీ

MI
By Mana Indur News•September 21, 2026
298
Share
ప్రభుత్వ పాఠశాలల స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ధర్నా

మన ఇందూర్ అర్బన్

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓ మయ్య అన్నారు. సోమవారం ప్రభుత్వ పాఠశాలల స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓ మయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల పరిశుభ్రత మూత్రశాలలు చెట్ల పచ్చదనం నీళ్ల ఏర్పాటు కోసం స్వీపర్లను స్కావెంజర్లను నియామకం చేయడం జరిగిందని వీరి వేతనాలను పాఠశాల విద్యార్థుల సంఖ్య ఆధారంగా కార్మికుల సంఖ్యను వేతనాలను నిర్ణయించడం జరిగిందని అన్నారు. వీరికి వేతనాలు చెల్లించే బాధ్యతలను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మదర్స్ కమిటీల ఖాతాల ద్వారా చెల్లించాలని నిర్ణయించారు.కానీ ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతిలో వేతనాలు అమలు కావటం లేదని కొంతమంది వీరికి వేతనాలు ఇచ్చే సమయంలో ఖర్చుల పేరుతో కొంత డబ్బులను తగ్గించి ఇస్తున్నారని అన్నారు. రెండు గంటలు పని చేయాల్సిన కార్మికులతో రోజంతా పని తీసుకుంటూ వారి శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. కార్మికులకు నాలుగు నెలల వేతనాలు పెండింగ్ లో ఉంటే వారి కుటుంబాలు ఏరకంగా జీవిస్తాయని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని కార్మికులకు చెల్లించే వేతనాలను వారి అకౌంట్లోనే జమ చేయాలని స్వీపర్లకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని పనిముట్లు ఇవ్వాలని ప్రమాద నష్టపరిహార చట్టాన్ని అమలు చేయడంతో పాటు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పై సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గారు వెంటనే డి ఈ ఓ ను పిలిపించి మూడు నెలలకు సంబంధించిన వేతనాల ఫైల్ పై సంతకం చేయడం జరిగిందని ఈరోజే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు తోపునూరి చక్రపాణి ప్రధాన కార్యదర్శి వసంత నాయకులు రాధా, లక్ష్మి ,సాయన్న, వనిత వివిధ మండలాల కార్మికులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5