Mana Indur News
రాజకీయం

ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి వామపక్షాల డిమాండ్

సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ సమావేశం

MI
By Mana Indur News•September 27, 2026
1
Share
ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి వామపక్షాల డిమాండ్

మన ఇందూర్ /నిజామాబాద్:

ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వామపక్షాల డిమాండ్ చేశారు.. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఎంఎల్ మాస్ లైన్, ఆర్ ఎస్ పి, ఎం సి పి ఐ ల సమావేశం జరిగింది. అనంతరం జరిగిన ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సర్ పేరుతో ఓట్లను తొలగించడంపై ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ప్రజల విశ్వాసాన్ని ఘోరంగా దెబ్బతీశారని ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లలో చనిపోయిన ఒకటి కన్న ఎక్కువ ఉన్న ఓట్లను తొలగించడానికి వామపక్ష పార్టీలు స్వాగతిస్తున్నాయని తెలిపారు. గతంలో ఈడి,సిబిఐ పేరుతో ప్రతిపక్షాలపై దాడులు చేసిన సంఘటనలు చూసామని కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ముందు పెట్టి ఓటర్లను తొలగించడం సరికాదని ధ్వజమెత్తారు. (ఈసీ) ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలని కానీ బిజెపి చేతిలో కీలుబొమ్మగా పనిచేస్తుందని అన్నారు ఇప్పటికే తొలగించినటువంటి ఓట్లను పునరుద్ధరించాలని నిజామాబాద్ జిల్లాలో 48 వేలకు పైగా ఓట్లు గల్లంతు అవుతున్నాయని వీరి ఓట్లు ఆధార్ తో అనుసంధానం చేయాలని కోరుతున్నామన్నారు. ఎస్ ఐ ఆర్ లు నిలిపివేయాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్తో అక్టోబర్ 1న నిజామాబాద్ ధర్నా చౌక్ లో జరిగే నిరసనలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.రమేష్ బాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య,ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి కటారి రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై ఓమయ్య నాయకులు అలీ ఇమ్రాన్, ఎం సిపిఐ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి కాజా మైనుద్దీన్,రాజన్న పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5