Mana Indur News
రాజకీయం

కేటీఆర్‌కు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం

కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రూరల్ లో బీ ఆర్ ఎస్ జండా ఎగరడం ఖాయం: కేటీఆర్.. స్వాగతం పలికిన బాజిరెడ్డి గోవర్ధన్, యువ నాయకులు బాజిరెడ్డి జగన్

MI
By Mana Indur News•November 1, 2026
53
Share
కేటీఆర్‌కు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం

కేటీఆర్‌కు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం

స్వాగతం పలికిన బాజిరెడ్డి గోవర్ధన్, బాజిరెడ్డి జగన్

కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రూరల్ లో బీ ఆర్ ఎస్ జండా ఎగరడం ఖాయం

మన ఇందూర్ న్యూస్/ ఇందల్వాయి:

రూరల్ లో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బీ ఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని ఇట్టే అర్థమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదాం అన్నారు.

ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న రైతు భారీ బహిరంగ సభకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదివారం ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ రూరల్ ఇంచార్జ్ యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టోల్‌ప్లాజా వద్దకు చేరుకొని కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఉత్సాహంగా కెసిఆర్, కేటీఆర్, కారే రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎవరిని ఇబ్బందులు పెట్టిన ఎవరూ అధైర్యపడవద్దన్నారు. అన్ని పింక్ బుక్ లో ఎక్కించాలన్నారు. కెసిఆర్ మార్గదర్శకంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రూలల్ లో మళ్లీ బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని, కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఇట్టి అర్థమవుతుందన్నారు. కేటీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో సుమారు 2,050 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల ప్రెసిడెంట్ చిలివేరి గంగా దాస్, మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు పాశం కుమార్ మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ బిరీష్ శెట్టి గడుకుల్ శ్రీనివాస్ అరటి రఘు మారంపల్లి సుధాకర్ చింతల దాసు నామాల గంగాధర్ మహేష్, తో పాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఉపసర్పంచులు మాజీ ఎంపీటీసీలు కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5