పనులు నాణ్యతతో చేపట్టాలి
పలు డివిజన్లలో భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్.

పనులు నాణ్యతతో చేపట్టాలి
పలు డివిజన్లలో భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్..
మన ఇందూర్ న్యూస్ నిజామాబాద్ అర్బన్ :
నిజామాబాద్ నగరంలో చేపట్టబోయే పనులను నాణ్యతతో నిర్మించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని 23, 24, 6, 48వ డివిజన్లలో రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇటీవల జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్ కు రూ.20 లక్షలు కేటాయించారన్నారు. ఈ నిధులతో ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే ఖిల్లా రామాలయ అభివృద్ధిలో భాగంగా రోప్ వే కు సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమవుతుందని చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గత మూడు సంవత్సరాలుగా సీడీపీ నిధుల కోసం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు, స్రవంతిరెడ్డి, సుమిత్ర కిషోర్, విజయ మల్లేష్ యాదవ్, ప్రసన్న శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.






